కొత్త సంవత్సరం వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు కామెడీ అదిరిపోయిందనే చెప్పాలి. రాజధాని రైతుల వద్దకు వెళ్లి ఆయన జగన్ సర్కారుపై రొటీన్ డైలాగులే వల్లించారు. సాదాసీదాగా డైలాగులు కొట్టి వస్తే బావుండదనుకున్నారో ఏమో.. కొత్త ఏడాది వేళ కొత్త ఫ్యామిలీ డ్రామాకు తెరలేపారు. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని భార్య భువనేశ్వరిని కూడా ఈ రోజు ఆందోళనకు చంద్రబాబు వెంటబెట్టుకొచ్చారు.

 

అంతేకాదు.. తనను ఆమే ఈ ఆందోళన చేయమందంటూ క్రెడిట్ మొత్తం భార్య ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే.. మనం పండుగెలా చేసుకుంటాం.. పదండి.. మనం ఈరోజు రైతుల ధర్నాలో పాల్గొందాం.. నేను కూడా వస్తాను అని భువనేశ్వరే చంద్రబాబుకు ధర్నాకు తీసుకొచ్చేసిందట. అంతేనా.. అక్కడితో ఆపితే బావుండదని డ్రామాను ఇంకాస్త రక్తికట్టించారు చంద్రబాబు.

 

అమరావతి రైతుల ఆందోళన కోసం భువనేశ్వరి తన బంగారు గాజు విరాళంగా ఇచ్చారు. అంతే కాదు.. చంద్రబాబుకు కూడా వ్యక్తిగతంలో మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇక ఈ దృశ్యాలన్నీ పచ్చ చానెళ్లలో మహా పసందుగా కనువిందు చేశాయి. అయితే ఈ సీన్ కు వైసీపీ నుంచి అనూహ్యమైన కౌంటర్ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

 

రాజధానికి గ్రామస్తులకు నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో కొట్టేసిన భూములు ఇచ్చేయాలని హితవు పలికారు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. భువనేశ్వరి బంగారు గాజులు విరాళం ఇవ్వడంపై పుష్పశ్రీవాణి స్పందించారు. రాజధాని రైతులకు ఇవ్వాల్సింది బంగారు గాజు కాదని హెరిటేజ్ పేరిట కొట్టేసిన 14.22ఎకరాలు, టీడీపీ నేతలు దోచుకున్న 4వేల ఎకరాల్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి ప్రజాశ్రేయస్సు అవసరం లేదని, భూముల్ని కాపాడుకునేందుకు అమరావతిలో రాజకీయం చేస్తున్నారని పుష్ప శ్రీవాణి కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: